Monthly Archives: October 2011

కొరటాల శివ దర్శకత్వంలో ఇద్దరు భామలతో ప్రభాస్‌

Prabhash Recha Gangopadyaya Anuskaప్రభాస్‌ ఇద్దరు భామలతో సయ్యాడబోతున్నారు. అనుష్క, రీచా గంగోపాథ్యాయ్‌ ఆ భామలు. ‘బిల్లా’లో ఓ మారు ప్రభాస్‌ సరసన నటించిన అనుష్క కి తనతో ఇది రెండో సినిమా. రీచాకి మాత్రం తొలి అవకాశం. ఈ చిత్రానికి రచయిత కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. యు.వి.క్రియేషన్స్‌ పతాకంపై వి.వంశీకృష్ణారెడ్డి-ప్రమోద్‌ ఉప్పలపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్‌లో సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. నిర్మాతలు మాట్లాడుతూ ‘ప్రభాస్‌ అభిమానుల అంచనాలను అందుకునే కథాంశంతో సినిమా రూపొందిస్తున్నాం. అన్నివర్గాలను అలరించేలా ఉంటుంది. త్వరలోనే రెగ్యులర్‌ చిత్రీకరణకు వెళుతున్నాం’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవీశ్రీప్రసాద్‌, కళ: ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఫైట్స్‌: అరసు, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, లైన్‌ ప్రొడ్యూసర్‌: అశోక్‌ కుమార్‌ రాజు, రచన-దర్శకత్వం: కొరటాల శివ.

నవంబర్‌ 5న క్షేత్రం పాటలు విడుదల

Kshetram Telugu Movieజగపతిబాబు-ప్రియమణి జంటగా నటించిన చిత్రం ‘క్షేత్రం’. కిక్‌ శ్యామ్‌ కీలకపాత్రధారి. టి.వేణుగోపాల్‌ దర్శకుడు. వై.ఎస్‌.ప్రతాప్‌ రెడ్డి సమర్పణలో శ్రీ బాలాజీ మూవీమేకర్స్‌ పతాకంపై టి.గోవిందరాజు నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయి నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. నిర్మాత మాట్లాడుతూ ‘చారిత్రక నేపథ్యమున్న సినిమా ఇది. నవ్యపంథాలో కథ సాగుతుంది. కోటి సంగీతం ఆకట్టుకుంటుంది. నవంబర్‌ 5న ఆదిత్య ద్వారా పాటలు విడుదల చేస్తాం. అదే నెలాఖరులో సినిమా రిలీజ్‌ చేస్తాం’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ప్రియమణి రెండు భిన్న పాత్రలలో నటించారు. నాగపెంచలమ్మగా ప్రియమణి అభినయం, వీర నరసింహరాయలుగా జగపతి బాబు నటన హైలైట్‌. కథాంశం ప్రస్తుత నేపథ్యం నుంచి చరిత్రలోకి ఎలా మలుపు తిరిగిందనేది ఆసక్తికరం’ అన్నారు. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, ఆదిత్యమీనన్‌, రాజీవ్‌ కనకాల, ఉత్తేజ్‌, అక్కినపల్లి రాజ్‌కుమార్‌, బ్రహ్మాజీ, అన్నపూర్ణమ్మ, హేమ, శివపార్వతి తదితరులు నటిస్తున్నారు. మాటలు: పరుచూరి బ్రదర్స్‌, సంగీతం: కోటి, కెమెరా: ఎం.వి.రఘు, కళ: రఘు కులకర్ణి, పాటలు: సుద్ధాల అశోక్‌తేజ, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: అక్కినపల్లి విజయ్‌కుమార్‌.

విశాఖలో బీచ్‌రోడ్డులో ఉదయం మోటారు వాహనాల నిషేధం

GVMCవిశాఖ : రేపటి నుంచి బీచ్‌రోడ్డులో ఉదయం 6గంటల నుంచి 9గంటల వరకు మోటారు వాహనాలను నిషేధించారు. బీచ్‌రోడ్‌లో సైక్లింగ్‌ చేయాలనుకునే వారి కోసం జీవీఎంసీ వంద సైకిళ్లను సిద్ధం చేసింది. ప్రజల్లో వాహన కాలుష్యంపై అవగాహన కలిపించేందుకు జీవీఎంసీ పలు ప్రయత్నాలు చేస్తోంది. ప్రతి సోమవారం తమ ఉద్యోగులు సైకిళ్ల మీదనే రావాలని కమిషనర్‌ ఆదేశించారు. ఈ రోజు ఆయన తన సిబ్బందితో కలిసి సైకిళ్ల మీదనే వార్డుల్లో పర్యటించారు. ద్విచక్రవాహనాలపై వచ్చిన వారిని కార్యాలయంలోకి అనుమతించలేదు.

ముఖ్యమంత్రి నవంబర్ రెండో తేదీన విశాఖ జిల్లా పర్యటన

AP CM Kiran Kumar Reddyవిశాఖపట్నం : రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి నవంబర్ రెండో తేదీన విశాఖ జిల్లా పర్యటనకు రానున్నారు. జిల్లాలో తొలిరోజు నిర్వహించే రచ్చబండ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారని అధికార వర్గాల సమాచారం. బుధవారం ఉదయం కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం విశాఖ జిల్లాకు వస్తారు. ఎలమంచిలి కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహించే రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం స్పైస్‌జెట్ విమానంలో తిరిగి హైదరాబాద్ వెళతారు. సీఎం పర్యటనకు సంబంధించి జిల్లా ఉన్నతాధికారులు, పోలీసులు ఏర్పాట్లు ప్రారంభించారు.

తగ్గిన బంగారం ధర

Gold Priceహైదరాబాద్‌ : హైదరాబాద్‌ మార్కెట్లో ఈ రోజు బంగారం ధర స్వల్పంగా తగ్గింది. నిన్నటితో పోల్చితే వెండి ధర కూడా రూ.1200 మేరకు తగ్గింది. ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.27,560, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 26,900, కిలో వెండి ధర రూ.56,300గా ఉంది.

అమెరికాలో మంచుతుపాను

Snowstorm hits New Jercyసౌత్‌విండ్సన్‌ : అమెరికా ఈశాన్యప్రాంతం పాలిట మంచు తుపాను పెనుభూతంగా మారింది. దీంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగి ప్రజలు ఇబ్బందుల పాలయ్యారు. న్యూజెర్సీ, కనెక్టికట్, మసాచుసెట్స్, న్యూయార్క్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఎమర్జెన్సీ విధించారు. మంచుతుపాన్‌ వల్ల ఇప్పటి వరకు ముగ్గురు మరణించారు. మసాచుసెట్స్‌లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. 27 అంగుళాల మేర మంచు పేరుకపోయింది. విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించడానికి వారం రోజుల సమయం పట్టొచ్చని ఓ రాష్ట్ర గవర్నర్‌ వ్యాఖ్యానించడం, అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది.

700 కోట్లకు చేరిన ప్రపంచ జనాభా

Seven Billionth Babyన్యూఢిల్లీ : ప్రపంచ జనాభా 700 కోట్లకు చేరింది. మనీలాలో జన్మించిన ఓ శిశువతో ప్రపంచ జనాభా ఏడువందల కోట్లకు చేరుకుంది. 31వ తేదీన జన్మించే మొదటి శిశువుతో ప్రపంచ జనాభా 700 కోట్లకు చేరుకుంటుందని ఐక్యరాజ్య సమితి జనాభా లెక్కల విభాగం అంచనా వేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి సోమవారం అధికారికంగా ప్రకటన చేసింది. కాగా 700 కోట్ల జనాభా చేరికపై విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

నవంబరు 7తర్వాత తెలంగాణపై నిర్ణయం: చిదంబరం

P Chidambaramన్యూఢిల్లీ: నవంబరు 7న (బక్రీద్) పండుగ తర్వాత తెలంగాణపై నిర్ణయం వెల్లడవుతుందని ఆశిస్తున్నానని కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకునే పరిణామాలన్నింటిని రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి గులాం నబీ ఆజాద్ ఎప్పటికప్పుడు తెలియచేస్తున్నారని ఆయన అన్నారు.

నవంబర్ నెలాఖరున 'తెలంగాణ గోదావరి'

Telangana Godavari Telugu Movieఅరుణ్, రమితాశెట్టి జంటగా దేవెంకి ఫిలిమ్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో రమేశ్‌రెడ్డి తుమ్మల నిర్మిస్తున్న చిత్రం ‘తెలంగాణ గోదావరి’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తున్నదని ఆయన తెలిపారు. “తెలంగాణ పది జిల్లాల్లో మా పాటలకు విశేష స్పందన వస్తోంది. పాటల రచయితలు రాచర్ల సురేశ్, లక్ష్మణ్ కోడిచర్ల, పద్మ శ్రీనివాస్, రమేశ్‌రెడ్డి అందించిన సాహిత్యానికి సంగీత దర్శకుడు యశోకృష్ణ చక్కని బాణీల్ని సమకూర్చారు. ఈ పాటల్లో తెలంగాణ బతుకును, వాళ్ల వెతలను కళ్లకు కట్టినట్లు చూపించాం. వాటిని అందమైన లొకేషన్‌లలో చిత్రీకరించాం. ఇది 1969-72 మధ్య కాలంలో తెలంగాణలో జరిగిన వాస్తవిక సంఘటన ఆధారంగా రూపొందించిన ప్రేమ కథాచిత్రం. 60 శాతం ప్రేమకథ, 40 శాతం తెలంగాణ పోరాట ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని రూపొందించాను. తొలి కాపీ సిద్ధమైన ఈ చిత్రానికి త్వరలోనే సెన్సార్ పనులు పూర్తిచేసి నవంబర్ నెలాఖరున చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఆడియో మాదిరిగానే చిత్రాన్నీ ప్రేక్షకులు విజయవంతం చేస్తారని ఆశిస్తున్నా” అని ఆయన అన్నారు.

నవంబర్ రెండో వారంలో 'ధీమా' విడుదల

Ramba Vijay Combination telugu Movieవిజయ్, రంభ జంటగా రూపొందిన ‘ధీమా’ చిత్రం డబ్బింగ్ పనులు పూర్తయ్యాయి. తమిళంలో కె.టి. కుంజుమోన్ నిర్మించగా ఘన విజయం సాధించిన ఓ చిత్రానికి ఇది తెలుగు రూపం. శ్రీనాగవర్మ సమర్పణలో పూజా ఫిలిమ్స్ పతాకంపై జి. మధుకుమార్ ఈ చిత్రాన్ని అందిస్తున్నారు.  ”శంకర్ దర్శకత్వంలో ‘జెంటిల్‌మన్’, ‘ప్రేమికుడు’ వంటి భారీ చిత్రాల్ని అందించిన కె.టి. కుంజుమోన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో కుటుంబ విలువలకు ఎంతో ప్రాధాన్యతనిచ్చే ఓ షిప్పింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ పాత్రలో విజయ్ అద్భుతంగా నటించారు. రంభ గ్లామర్ ప్రేక్షకుల్ని అలరిస్తుంది. అధిక భాగం స్విట్జర్లాండులో చిత్రీకరించిన ఈ చిత్రంలోని ఆరు పాటలు, నాలుగు ఫైట్లు మాస్ ప్రేక్షకుల్ని అలరిస్తాయి. భానుప్రియ, రఘువరన్ కీలక పాత్రల్లో కనిపిస్తారు. అక్కాతమ్ముళ్ల సెంటిమెంట్ ఫ్యామిలీ ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. అటు మాస్, ఇటు క్లాస్ ప్రేక్షకుల్ని సమానంగా ఆకట్టుకునే ఈ చిత్రాన్ని నవంబర్ రెండో వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం” అని చెప్పారు నిర్మాత మధుకుమార్. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: శివ, కూర్పు: త్రినాథ్, డాన్స్: శివశంకర్, కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం: మనోజ్ భట్నాగర్.

web designing in vizag , vijayawada Web Designing,Website Designing,Web Designing Company,Website Designing Company,Web Designing in anakapalli,Website Designing in anakapalli,Web Designing anakapalli,Website Designing anakapalli, Web Design,Website Design,Web Design Company,Website Design Company,Web Design Companies,Website Design Companies anakapalli,web hosting anakapalli,web hosting solutions anakapalli,Hosting Services in anakapalli,Reseller web Hosting anakapalli,seo Optimization anakapalli,seo anakapalli,bulk sms anakapalli,Cheap SMS anakapalli,anakapalli Bulk SMS Solutions,Cheap SMS anakapalli,mass sms service in anakapalli,bulk sms Company anakapalli,bulksms Companies in anakapalli,bulks emails anakapalli,windows hosting anakapalli,linux hosting anakapalli,search engine optimization anakapalli,online websites anakapalli,online marketing services anakapalli,web application software development anakapalli,e-commerce website development anakapalli,graphic designing anakapalli,logo designing anakapalli,add design anakapalli,poster designing anakapalli,event managers in anakapalli,event management in anakapalli,Web design studio anakapalli,creative websites and web hosting services anakapalli,professional web site designing web development anakapalli.

anakapalli design website, website design, web design website anakapalli, website and design, anakapalli website development design, website design development, website design company, company website design,websites design,designer website,design websites,website designer,graphic website design,website graphic design,website designers,graphic design website,website design services,anakapalli designers website,website design hosting, professional website design, website design professional, website design firm,website design software,flash website design,flash design website,website design flash,website design marketing,php website design,design a website,website templates design,website design business,web design websites,designing website,website designing,website designs,business website design,website design and development,website development and design,design your website,website design template,anakapalli website design online,online website design,website design india,ecommerce website design,website hosting and design,website design and hosting,website design companies,website design anakapalli,anakapalli website design,affordable website design anakapalli,website design and marketing,website design service,e commerce website design,website designing india,design of website,website design anakapalli,website design html,website design agency,graphic design websites,internet website design,small business website design,designing a website,designer websites,website design jobs,website design tips,best website design, website design Designing in anakapalli,website design how to,how to design website,website designing company,designers websites,corporate website design,anakapalli website design,websites designing,website design program,designing websites,design your own website,freelance website designer,website design anakapalli,website designing software anakapalli,website designers anakapalli,anakapalli website design,cheap website design anakapalli,website design anakapalli,website design tools,good website design,website layout design,designed websites,easy website design,how to design a website,website design anakapalli,anakapalli website design,website design cost,website design awards,top website design,effective website design,professional website designers,interior design website,anakapalli,anakapalli,andhra Pradesh,India website design,web design,website development,web designers,web development,web design company,web developers,website design company anakapalli,website development,website redesign,website maintenance and content management,anakapalli search engine optimization,reliable website hosting,corporate website design and development,university website design and development,manufacturing industry website design and development,e commerce website design and development,web portal development,web portal developers,web portal design,b2b portal development,b2c portal development,Education,Health Care,Retail,Real Estate website Designing in anakapalli,Manufacturing and Consultant’s & NGOS,payment gateway integration,e-learning,e-commerce,online alumini,e-shop,CMS,anakapalli,andhra Pradesh,India,Bulk SMS anakapalli,Cheap SMS anakapalli,Cheap SMS Provider anakapalli,Cheapest SMS offer,anakapalli Premium SMS Gateway,Bulk SMS Solutions in anakapalli,SMS Short Code,SMS Long Codes,Dedicated Short Code,SMS anakapalli