Monthly Archives: November 2011

ముగిసిన శాసనసభ బీఏసీ భేటీ

అసెంబ్లీ స్పీకర్‌ నాదేండ్ల మనోహర్‌ అధ్యక్షతన జరిగిన బీఏసీ భేటీ ముగిసింది. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబరు1 నుంచి 5వరకు జరుగుతాయి. శని, ఆదివారాల్లో సైతం సమావేశాలు ఉంటాయని సమావేశం నిర్ణయించింది. ఎక్కువ రోజులు సమావేశాలు నిర్వహించాలని సమావేశంలో విపక్షాలు పట్టుబట్టాయి. రైతు సమస్యలు, కరవుపై చర్చించాలని బీఏసీలో నిర్ణయించారు. ప్రభుత్వంపై రేపు అవిశ్వాసం నోటీసు ఇస్తామని టీడీపీ నేతలు స్పీకర్‌కు చెప్పారు. సభలో తెలంగాణ తీర్మానం ప్రవేశపెట్టాలని బీఏసీలో టీఆర్‌ఎస్‌ డిమాండ్‌ చేసింది.

ఆరుగురు ఉగ్రవాదుల అరెస్ట్

న్యూఢిల్లీ : ఆరుగురు ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులను బుధవారం ఉదయం ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ఒకరు పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదిగా సమాచారం. వీరికి ఢిల్లీ, బెంగుళూరు, పూణెలలో జరిగిన పేలుళ్లతో సంబంధం ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

చట్టాల అమలులో రాజకీయ జోక్యం అనవసరమ: డీఎల్

D L RAVEENDRA REDDYహైదరాబాద్: చట్టాల అమలులో రాజకీయ జోక్యం అనవసరమని, చట్టాలను మరింత కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. బుధవారం ఉదయం గోల్కొండ హాల్‌లో డోన్ట్ డ్రింక్ డ్రైవ్ లోగోను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ బార్‌లు, పబ్‌లు వేళలను కుదించాలని ఆయన అన్నారు. తప్పు చేసిన వారు మంత్రి అయినా, అధికారి అయినా ఒకటే అని ఆయన వ్యాఖ్యానించారు. చట్టం ముందు అందరూ సమానమే అని డీఎల్ పేర్కొన్నారు.

ముదోల్ ఎస్ఐ ఆత్మహత్య

ఆదిలాబాద్ : జిల్లాలోని ముదోల్ ఎస్ఐ తాజుద్దీన్ ఆత్మహత్య చేసుకున్నారు. పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో సర్వీస్ రివాల్పర్‌తో కాల్చుకుని తాజుద్దీన్ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నెల 25న తాజుద్దీన్ విధుల్లోకి చేరారు. మంగళవారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన తాజుద్దీన్ బుధవారం ఉదయం రక్తపుమడుగుల్లో పడిఉన్నారు. తాజుద్దీన్ ఆత్మహత్య గురించి తెలిసిన కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. తాజుద్దీన్ స్వస్థలం మందమర్రి. ఈ నెల 19నే ఆయన వివాహం జరిగింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

జనవరి 14న 450 థియేటర్లలో పూలరంగడు

Sunil and Isha Chawlaసునీల్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘పూలరంగడు’. ఇషాచావ్లా కథానాయిక. ‘అహ నా పెళ్లంట’ ఫేం వీరభద్రమ్‌ దర్శకుడు. ఆర్‌.ఆర్‌.మూ వీమేకర్స్‌ సమర్పణలో మాక్స్‌ఇండియా ప్రొడక్షన్స్‌ పతాకంపై కె.అచ్చిరెడ్డి నిర్మిస్తున్నారు. జనవరి 14న 450 థియేటర్లలో ఈ సినిమాని విడుదల చేస్తున్నారు.

నిర్మాత మాట్లాడు తూ ‘‘అందాల రాముడు, మర్యాద రామన్న- తర్వాత సునీల్‌ కొత్త కోణంలో కనిపించ బోతున్నాడు. తన ఇమేజ్‌ పెంచే చిత్రమి ది. ఇషాచావ్లా నటన, అనూప్‌ సంగీతం సినిమాకి అదనపు అస్సెట్స్‌. ప్రస్తుతం పతాకసన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం. 4 పాటలు మినహా షూటింగ్‌ పూర్తయింది. సంక్రాంతి కానుకగా మీ ముందుకొస్తున్నాం. మా సంస్థలో మరో మ్యూజికల్‌ హిట్‌ను అందుకోనున్నాం’’ అన్నారు.

కోట శ్రీనివాసరావు, అలీ, ప్రదీప్‌రావత్‌, రఘుబాబు, దేవ్‌గిల్‌, పృధ్వి, సుధ, ప్రగతి, శ్రీలలిత, సత్యం రాజేష్‌, దువ్వాసి మోహన్‌, ఖలీల్‌, ప్రవీణ్‌, వేణుగోపాల్‌ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రా నికి కెమెరా: ప్రసాద్‌ మురెళ్ల, సంగీ తం: అనూప్‌ రూబెన్స్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, మాటలు: శ్రీధర్‌ సీపన, కళ: నాగేంద్ర, కథ-కథనం-దర్శకత్వం: వీరభద్రమ్‌.

ధోనీ బాలీవుడ్ ఎంట్రీ ?

MS Dhoni

మహేంద్ర సింగ్ ధోని త్వరలో బాలీవుడ్ తెరపై మెరవబోతున్నాడు. బాలీవుడ్ దర్శకుడు డేవిడ్ ధావన్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ‘హుక్ యా క్రూక్ ’ సినిమాలో బాలీవుడ్ హీరో జాన్ అబ్రహంతో కలిసి ధోనీ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని సమాచారం. ఇందు కోసం ఇప్పటికే ధోనీ వద్ద డేట్స్ తీసుకున్నారని, 15 రోజుల పాటు ధోనీ డేట్స్ ఇచ్చాడని అంటున్నారు. ధోనీ ఇందులో ముఖ్యమైన అతిపాత్రలో ధోనీ కనిపించనున్నాడని తెలుస్తోంది. సత్తా ఉన్న క్రికెటర్ గా, సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా దూసుకెలుతున్న ధోనీ….ఇప్పటికే వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ తన హవా కొనసాగిస్తున్నాడు. తాజాగా బాలీవుడ్ ఎంట్రీతో ఒకే సారి మూడు రంగాల్లో రాణిస్తున్న వ్యక్తిగా ధోనీ రికార్డులకు ఎక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ధోనీ బాలీవుడ్ ఎంట్రీ కనుక సక్సెస్ అయితే ఆయకు అవకాశాలు కుప్పలు తెప్పలుగా వచ్చి పడటం ఖాయం.

ఏకైక టి20లో పాక్ విజయం

Mohd Hafeezమిర్పూర్: పాక్ బౌలర్ల ధాటికి టి20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతులెత్తేసింది. 136 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక కేవలం 85 పరుగులకే పరిమితమైంది. దీంతో పాక్ 50 పరుగుల తేడాతో గెలిచి ఏకైక టి20 సిరీస్‌ను 1-0తో దక్కించుకుంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 135/7 పరుగులు చేసింది. ఓపెనర్ మహ్మద్ హఫీజ్ (31 బంతుల్లో 25; ఫోర్లు 2, సిక్స్ 1) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బంగ్లాదేశ్‌లో షకీబ్ అల్ హసన్, అలోక్ కపాలి చెరి రెండు వికెట్లు తీశారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆతిథ్య జట్టు ఘోరంగా విఫలమై 85/9 పరుగులే చేయగలిగింది. పాక్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో హుస్సేన్ (35; ఫోర్లు 2, సిక్స్ 1), రహీం (10) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. బౌలింగ్‌లోనూ రాణించి రెండు వికెట్లు తీసుకున్న హఫీజ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.

చివరి వరకూ పోరాడి ఓడిన వెస్టిండీస్

Rohit Sharmaకటక్: బారాబతి స్టేడియంలో మంగళవారం వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ ఒక్క వికెట్ తేడాతో నెగ్గింది. 212 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 48.5 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసి గెలిచింది. 59 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును రోహిత్ శర్మ (99 బంతుల్లో 72; 3 ఫోర్లు, 1 సిక్సర్), జడేజా (62 బంతుల్లో 38; 3 ఫోర్లు) కలిసి ఆదుకున్నారు. ఈ ఇద్దరూ ఆరో వికెట్‌కు 83 పరుగులు జోడించారు. ఒక ఎండ్‌లో వికెట్లు పడ్డా రోహిత్ చివరి వరకూ పోరాడి విజయం అంచుల్లోకి తీసుకొచ్చాడు. వినయ్ కుమార్ (48 బంతుల్లో 18; 1 ఫోర్) రోహిత్‌కు అండగా నిలబడ్డాడు. కీలక దశలో ఈ ఇద్దరూ అవుటైనా… బౌలర్లు ఉమేశ్, ఆరోన్ కలిసి ఒత్తిడిని తట్టుకుని ఆఖరి వికెట్‌కు అజేయంగా 12 పరుగులు జోడించి విజయాన్ని ఖరారు చేశారు. విండీస్ బౌలర్లలో రోచ్ మూడు, రస్సెల్ రెండు వికెట్లు పడగొట్టారు. ఈ లో స్కోరింగ్ మ్యాచ్‌లో విండీస్ బౌలర్లు ఏకంగా 23 ఎక్స్‌ట్రాలు సమర్పించుకుని మూల్యం చెల్లించారు. రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఐదు వన్డేల సిరీస్‌లో ప్రస్తుతం భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది.

స్కోరు వివరాలు

వెస్టిండీస్ ఇన్నింగ్స్: సిమ్మన్స్ (బి) ఉమేశ్ 19; బరాత్ (సి) పార్థీవ్ (బి) వినయ్ 17; శామ్యూల్స్ (బి) ఆరోన్ 10; డారెన్ బ్రావో (బి) రైనా 60; హైత్ రనౌట్ 31; పొలార్డ్ (సి) కోహ్లి (బి) అశ్విన్ 13; రామ్‌దిన్ (సి) అండ్ (బి) ఉమేశ్ 14; స్యామీ (బి) జడేజా 0; రస్సెల్ (బి) ఆరోన్ 22; రోచ్ నాటౌట్ 12; మార్టిన్ నాటౌట్ 3; ఎక్స్‌ట్రాలు (లెగ్‌బైస్ 4, వైడ్లు 6) 10; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి) 211. వికెట్ల పతనం: 1-18; 2-46; 3-52; 4-127; 5-154; 6-159; 7-169; 8-183; 9-200. బౌలింగ్: వినయ్ కుమార్ 6-0-27-1; ఉమేశ్ యాదవ్ 8-1-33-2; వరుణ్ ఆరోన్ 9-0-47-2; అశ్విన్ 10-1-30-1; రవీంద్ర జడేజా 10-0-42-1; రైనా 5-0-20-1; రోహిత్ శర్మ 2-0-8-0.

భారత్ ఇన్నింగ్స్: పార్థీవ్ (సి) మార్టిన్ (బి) రోచ్ 12; సెహ్వాగ్ (బి) రస్సెల్ 20; గంభీర్ (సి) రామ్‌దిన్ (బి) రోచ్ 4; కోహ్లి (బి) రోచ్ 3; రోహిత్ (బి) మార్టిన్ 72; రైనా (సి) బ్రావో (బి) రస్సెల్ 5; జడేజా (సి) సిమ్మన్స్ (బి) పొలార్డ్ 38; అశ్విన్ రనౌట్ 6; వినయ్ (సి) రోచ్ (బి) స్యామీ 18; ఆరోన్ నాటౌట్ 6; ఉమేశ్ నాటౌట్ 6; ఎక్స్‌ట్రాలు (లెగ్‌బైస్ 3, వైడ్లు 16, నోబాల్స్ 4) 23; మొత్తం (48.5 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి) 213. వికెట్ల పతనం: 1-37; 2-41; 3-47; 4-51; 5-59; 6-142; 7-159; 8-201; 9-201. బౌలింగ్: రోచ్ 10-0-46-3; మార్టిన్ 6-1-35-1; రస్సెల్ 9-1-29-2; స్యామీ 8.5-1-40-1; శామ్యూల్స్ 10-0-37-0; పొలార్డ్ 5-0-23-1.

బళ్లారి రూరల్ అసెంబ్లీకి నేడు ఉప ఎన్నిక

Sriramulu బళ్లారి: బళ్లారి రూరల్ అసెంబ్లీ స్థానానికి బుధవారం ఉప ఎన్నిక జరగనుంది. జిల్లా అధికార యంత్రాంగం పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. భారీగా పోలీసు బలగాలను, పారామిలటరీ దళాలనూ మోహరించింది. జిల్లా వ్యాప్తంగా 13 ప్రాంతాల్లో తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. రాష్ర్ట ఎన్నికల కమిషనర్ మనోజ్ కుమార్ ఎన్నిక ఏర్పాట్లను పరిశీలించారు.

కాంగ్రెస్ తరఫున రాంప్రసాద్, బీజేపీ తరఫున గాది లింగప్ప, స్వతంత్ర అభ్యర్థిగా మాజీ మంత్రి శ్రీరాములు బరిలో ఉన్నారు. శ్రీరాములు రాజీనామాతో ఈ ఉప ఎన్నిక జరుగుతోంది.

వీఆర్‌ఓ, వీఆర్‌ఏ పోస్టులకు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు

Raghuveera Reddyహైదరాబాద్: గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్‌ఓ), గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్‌ఏ) పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ, హాల్‌టికెట్ల జారీ ప్రక్రియలు ఆన్‌లైన్ ద్వారానే నిర్వహించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించినట్లు రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. 1,172 వీఆర్‌ఓ, 6,063 వీఆర్‌ఏ పోస్టుల భర్తీకి మార్గదర్శకాలపై మంగళవారమిక్కడ మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు ధర్మాన ప్రసాదరావు, రఘువీరారెడ్డి, శ్రీధర్‌బాబు సమావేశమై చర్చించారు. అనంతరం ఆ వివరాలను మంత్రి రఘువీరారెడ్డి మీడియాకు వెల్లడించారు. రెండు రకాల పోస్టులకు 18-34 ఏళ్ల మధ్య వయసున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ 7న అన్ని జిల్లాల్లో నోటిఫికేషన్లు జారీ చేస్తారు. అదే నెల 29 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు. వచ్చే ఏడాది జనవరి 30వ తేదీ ఉదయం వీఆర్‌ఓలకు, మధ్యాహ్నం వీఆర్‌ఏలకు రాత పరీక్ష ఉంటుంది. ఫిబ్రవరి 15న ఫలితాలు ప్రకటించి, అదేనెల 24వ తేదీలోగా నియామక ఉత్తర్వులు ఇస్తారు.

web designing in vizag , vijayawada Web Designing,Website Designing,Web Designing Company,Website Designing Company,Web Designing in anakapalli,Website Designing in anakapalli,Web Designing anakapalli,Website Designing anakapalli, Web Design,Website Design,Web Design Company,Website Design Company,Web Design Companies,Website Design Companies anakapalli,web hosting anakapalli,web hosting solutions anakapalli,Hosting Services in anakapalli,Reseller web Hosting anakapalli,seo Optimization anakapalli,seo anakapalli,bulk sms anakapalli,Cheap SMS anakapalli,anakapalli Bulk SMS Solutions,Cheap SMS anakapalli,mass sms service in anakapalli,bulk sms Company anakapalli,bulksms Companies in anakapalli,bulks emails anakapalli,windows hosting anakapalli,linux hosting anakapalli,search engine optimization anakapalli,online websites anakapalli,online marketing services anakapalli,web application software development anakapalli,e-commerce website development anakapalli,graphic designing anakapalli,logo designing anakapalli,add design anakapalli,poster designing anakapalli,event managers in anakapalli,event management in anakapalli,Web design studio anakapalli,creative websites and web hosting services anakapalli,professional web site designing web development anakapalli.

anakapalli design website, website design, web design website anakapalli, website and design, anakapalli website development design, website design development, website design company, company website design,websites design,designer website,design websites,website designer,graphic website design,website graphic design,website designers,graphic design website,website design services,anakapalli designers website,website design hosting, professional website design, website design professional, website design firm,website design software,flash website design,flash design website,website design flash,website design marketing,php website design,design a website,website templates design,website design business,web design websites,designing website,website designing,website designs,business website design,website design and development,website development and design,design your website,website design template,anakapalli website design online,online website design,website design india,ecommerce website design,website hosting and design,website design and hosting,website design companies,website design anakapalli,anakapalli website design,affordable website design anakapalli,website design and marketing,website design service,e commerce website design,website designing india,design of website,website design anakapalli,website design html,website design agency,graphic design websites,internet website design,small business website design,designing a website,designer websites,website design jobs,website design tips,best website design, website design Designing in anakapalli,website design how to,how to design website,website designing company,designers websites,corporate website design,anakapalli website design,websites designing,website design program,designing websites,design your own website,freelance website designer,website design anakapalli,website designing software anakapalli,website designers anakapalli,anakapalli website design,cheap website design anakapalli,website design anakapalli,website design tools,good website design,website layout design,designed websites,easy website design,how to design a website,website design anakapalli,anakapalli website design,website design cost,website design awards,top website design,effective website design,professional website designers,interior design website,anakapalli,anakapalli,andhra Pradesh,India website design,web design,website development,web designers,web development,web design company,web developers,website design company anakapalli,website development,website redesign,website maintenance and content management,anakapalli search engine optimization,reliable website hosting,corporate website design and development,university website design and development,manufacturing industry website design and development,e commerce website design and development,web portal development,web portal developers,web portal design,b2b portal development,b2c portal development,Education,Health Care,Retail,Real Estate website Designing in anakapalli,Manufacturing and Consultant’s & NGOS,payment gateway integration,e-learning,e-commerce,online alumini,e-shop,CMS,anakapalli,andhra Pradesh,India,Bulk SMS anakapalli,Cheap SMS anakapalli,Cheap SMS Provider anakapalli,Cheapest SMS offer,anakapalli Premium SMS Gateway,Bulk SMS Solutions in anakapalli,SMS Short Code,SMS Long Codes,Dedicated Short Code,SMS anakapalli