Monthly Archives: December 2011

నూతన సంవత్సర శుభాకాంక్షలు : ప్రధాని

Manmohan Singhన్యూఢిల్లీ : ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మరింత పారదర్శకంగా పనిచేసేలా చూస్తానని తెలిపారు. పటిష్టమైన లోక్‌పాల్‌కు ప్రభుత్వం ట్టుబడి ఉందని ప్రధాని అన్నారు. రాజ్యసభలో ఆమోదం లేకపోవడం దురదృష్టకరమన్నారు.

ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలకు జంబ్లింగ్ విధానం: పార్థసారధి

K Parthasarathiవిజయవాడ: ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలు జంబ్లింగ్ విధానంలోనే జరుగుతాయని మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారధి స్పష్టం చేశారు. ఆయన శనివారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ ఈ ఏడాది నుంచి జంబ్లింగ్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో వచ్చే ఏడాది నుంచి 355 మోడల్ స్కూళ్లు అందుబాటులోకి రానున్నట్లు మంత్రి తెలిపారు. స్వతంత్ర ప్రతిపత్తి కింద పనిచేసే ఈ స్కూళ్లలో ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

మీడియా విలువలను కాపాడాలి : ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ

Vice-president Hamid Ansariహైదరాబాద్‌ : నేటి యువతను ఆకట్టుకునే విధంగా మీడియా ఉండాలని ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ సూచించారు. ప్రజల మనోభావాలు ప్రతిబింబించే విధంగా వార్తలు ప్రచురించాలన్నారు. ‘సియాసత్‌’ ఉర్దూ దినపత్రిక ఆధ్వర్యంలో ఇక్కడి జూబ్లీహాలులో జరిగిన ప్రపంచ ఉర్దూ సంపాదకుల సదస్సును శుక్రవారం ఆయన ప్రారంభించారు. స్వాతంత్య్రోద్యమ పోరాటంలో ఉర్దూ పత్రికలు ప్రముఖ పాత్ర పోషించాయని తెలిపారు. ఉర్దూ అంతర్జాతీయ భాషగా అభివృద్ధి చెందిందని, అన్ని దేశాలకూ విస్తరించిందని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఉర్దూ జర్నలిజాన్ని అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. నేడు పత్రికల ముందు ఎన్నో సవాళ్లున్నాయని, ప్రకటనలు రావడం, పాఠకులను పెంచుకోవడం ఒక భాగమైతే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వార్తలు ప్రచురించడమూ కీలక సవాల్‌ అని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా ప్రజల మనోభావాలను ప్రతిబింబించే విధంగా, వాస్తవాలను ప్రచురించే సాధనంగా మీడియా పనిచేయాలని సూచించారు. మీడియా విలువలను కాపాడాలని కోరారు.

సమాజంలో మార్పు కోసం వార్తలు రాయాలి : గవర్నర్‌

గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసింహన్‌ మాట్లాడుతూ మీడియా సమాజానికి బాధ్యత వహించాలన్నారు. డబ్బు లాలూచీలో పడి అబద్ధాలు, అసత్యాలు రాయకూడదని సూచించారు. సంచలనాల కోసం వార్తలు రాయొద్దని, సమాజంలో మార్పు కోసం రాయాలని కోరారు. ప్రభుత్వం ఎప్పుడూ చెడ్డగా ఉండబోదని, మంచి పనులూ చేస్తుందన్నారు. వాటిని వెలుగులోకి తేవాలని సూచించారు. సమాజంలో ఐక్యమత్యం పెరగాలంటే మంచి విషయాలను తెరమీదికి తేవాల్సిన బాధ్యత మీడియాపైనే ఉందన్నారు.

తిరుమల శ్రీవారి ఆదాయం 17వందల కోట్లు

Tirumala Tirupati Devasthanamతిరుపతి: తిరుమల శ్రీవారిని 2011 జనవరి నుంచి శుక్రవారం వరకు 11నెలల 30 రోజుల కాలంలో 2.30కోట్ల మంది భక్తులు దర్శించుకున్నట్టు టిటిడి అధికారులు అంచనా వేశారు. భక్తులు స్వామివారికి సమర్పించిన కానుకల ద్వారా 17వందల కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్టు తెలిసింది. ఇందులో హుండీలో లభించిన బంగారు ఆభరణాలు, నగలు, వజ్రాలు, నగదు, బ్యాంకు డిపాజిట్ల ద్వారా వచ్చిన ఆదాయం 11వందల కోట్లు అని అంచనా. మరో రెండున్నర కోట్ల రూపాయలు ఆర్జిత సేవా టిక్కట్ల ద్వారా వచ్చింది. మరో 130 కోట్ల రూపాయలు తలనీలాల విక్రయం ద్వారా లభించింది. మిగిలిన మొత్తం అద్దెలు, ప్రసాదాల విక్రయాలతో వచ్చినట్టు అంచనా.

అత్యదిక వేగంతో పరిభ్రమించే నక్షత్రం

VFTS102 STAR

ఇప్పటి వరకూ గుర్తించిన వాటిల్లో అత్యంత వేగంగా పరిభ్రమించే నక్షత్రం ఇదే. దీని వేగం మన సూర్యుని వేగం కంటే 100 రెట్లు అధికం.  కొత్త నక్షత్రానికి వీఎఫ్‌టీఎస్ 102గా నాసా శాస్త్రవేత్తలు నామకరణం చేశారు. ఇది భూమికి 1,60,000 కాంతి సంవత్సరాల దూరంలో  ఉంది.

హిందీలో రామ్‌చరణ్

Hero Ram Charan Tejచిరంజీవి తనయుడు  రామ్‌చరణ్ హిందీ రంగంలోకి అడుగుపెట్టబోతున్నారు. తొలి ప్రయత్నంగా ఆయన  చేయబోతున్నది సాదా సీదా సినిమా కాదు. బిగ్ బి అమితాబ్ బచ్చన్‌కి స్టార్ హోదాని తెచ్చిపెట్టిన  ‘జంజీర్’ రీమేక్ ద్వారా చరణ్ బాలీవుడ్‌కి పరిచయం కాబోతున్నారని సమచారం. ఈ చిత్రం ఆధారంగానే  తెలుగులో ఎన్టీఆర్ హీరోగా ‘నిప్పులాంటి మనిషి’ చిత్రాన్ని రూపొందించారు. పాత ‘జంజీర్’ని ప్రకాష్ మెహ్రా  స్వీయదర్శకత్వంలో రూపొందించారు. 1973లో విడుదలైన ఈ చిత్రం ఓ ట్రెండ్‌సెట్టర్ అయ్యింది. ప్రస్తుతం  ఈ చిత్రం రీమేక్‌ని ప్రకాష్ మెహ్రా తనయుడు రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మించబోతున్నారని  వినికిడి. ఏక్ అజ్‌నబీ, షూట్‌ఔట్ లోకండ్‌వాలా చిత్రాలకు దర్శకత్వం వహించిన అపూర్వ లకియా ఈ  చిత్రానికి దర్శకత్వం వహించనున్నారట. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ చిత్రం సెట్స్‌కి వెళ్లే అవకాశం ఉందట.

వ్యవసాయ శాఖలో 1431 పోస్టుల భర్తీ

హైదరాబాద్:వ్యవసాయ శాఖలో ఖాళీగా ఉన్న 881 వ్యవసాయ అధికారులు, 550 వ్యవసాయ విస్తరణ అధికారుల పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. వీటిపై మరో నెలరోజుల్లో నోటిఫికేషన్ వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నాలుగో ర్యాంక్‌లో సచిన్

Sachin Romesh Tendulkarదుబాయ్: భారత మాస్టర్ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు మెరుగుపర్చుకున్నాడు. శుక్రవారం విడుదల చేసిన తాజా జాబితాలో కలిస్ (దక్షిణాఫ్రికా)తో కలిసి మాస్టర్ సంయుక్తంగా నిలిచాడు. మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ రాహుల్ ద్రవిడ్ రెండు స్థానాలు కోల్పోయి 11వ ర్యాంక్‌కు పడిపోయాడు. వీవీఎస్ లక్ష్మణ్ 17వ, సెహ్వాగ్ 18వ ర్యాంక్‌ల్లో కొనసాగుతున్నారు. బౌలింగ్‌లో జహీర్ టాప్-10లో కొనసాగుతున్నాడు.

ఉపఎన్నికల్లో తమ పార్టీ మొత్తం 18 స్థానాల్లో పోటీ: వైఎస్‌ జగన్‌

YS Jagan Mohan Reddyహైదరాబాద్‌ : ఉపఎన్నికల్లో తమ పార్టీ మొత్తం 18 స్థానాల్లో పోటీచేస్తుందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఎంపీ వైఎస్‌ జగన్‌ చెప్పారు. తమ పార్టీ అనుసరించే విధానాలను ఆయన శుక్రవారం తెలిపారు. రైతుల కోసం విప్‌ని ధిక్కరించిన ఎమ్మెల్యేలే తమ పార్టీ అభ్యర్థులని ఆయన ప్రకటించారు. రాజీనామా చేసిన పీఆర్పీ పార్టీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి తమ పార్టీనుంచి పోటీ చేస్తోందని అన్నారు. టిడిపి కుమ్మక్కు విధానాలను వ్యతిరేకిస్తూ రాజీనామా చేసిన ప్రసన్నకుమార్‌రెడ్డి కూడా తమ పార్టీ నుంచి పోటీచేస్తారని చెప్పారు. తెలంగాణ కోసం రాజీనామా చేసిన వారిపై పోటీ చేసేది లేదని ఆయన స్పష్టం చేశారు. బలమైన ఆకాంక్షతో వారు పదవులు వదులుకున్నారని, వారిని గౌరవించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు జగన్‌ తెలిపారు. ఇటీవల ఆకాల మరణం చెందిన మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే రాజేశ్వర్‌రెడ్డి సతీమణిని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటిచేయమని కోరుతున్నామని అన్నారు. ఒకవేళ ఆమె వేరే పార్టీ నుంచి పోటీచేసినా, ఆమెపై పోటీ పెట్టమని జగన్‌ స్పష్టం చేశారు.

వంద రోజులు పూర్తి చేసుకున్న 'దూకుడు'

Mahesh Babu Dookuduమహేశ్, సమంత జంటగా దర్శకుడు శ్రీను వైట్ల రూపొందించిన ‘దూకుడు’ శనివారం (డిసెంబర్ 31)తో వంద రోజులు పూర్తి చేసుకుంది. జి. రమేశ్‌బాబు సమర్పణలో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు.

మహేశ్ మాట్లాడుతూ “ప్రేక్షకులు, అభిమానుల ఆదరణతో ‘దూకుడు’ రికార్డులు సృష్టించింది. ఇలాంటి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన 2011ని ఎప్పటికీ మర్చిపోలేను. నాన్నగారు ‘దూకుడు’ చూడగానే 80 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రను తిరగ రాస్తుందని చెప్పారు. ఆయన చెప్పినట్లే జరిగినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సక్సెస్ క్రెడిట్ అంతా దర్శకుడు శ్రీను వైట్లకి చెందుతుంది. నా కెరీర్‌లో బెస్ట్ ప్రొడ్యూసర్స్ రామ్, గోపీ, అనిల్ గార్లకు థాంక్స్. ఈ సినిమా యూనిట్ మొత్తానికీ నా కృతజ్ఞతలు’‘ అని చెప్పారు.

దర్శకుడు శ్రీను వైట్ల మాట్లాడుతూ “కృష్ణగారి అభిమానినైన నేను మహేశ్‌తో ‘దూకుడు’ లాంటి ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్ చేసినందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఇలాంటి సెన్సేషనల్ హిట్‌కి నా స్నేహితులైన రామ్, గోపీ, అనిల్ నిర్మాతలవడం మరింత ఆనందాన్ని కలిగించింది. మహేశ్‌తో ‘దూకుడు’ని మించిన సినిమా మరోటి తియ్యాలని ఉంది” అన్నారు.

web designing in vizag , vijayawada Web Designing,Website Designing,Web Designing Company,Website Designing Company,Web Designing in anakapalli,Website Designing in anakapalli,Web Designing anakapalli,Website Designing anakapalli, Web Design,Website Design,Web Design Company,Website Design Company,Web Design Companies,Website Design Companies anakapalli,web hosting anakapalli,web hosting solutions anakapalli,Hosting Services in anakapalli,Reseller web Hosting anakapalli,seo Optimization anakapalli,seo anakapalli,bulk sms anakapalli,Cheap SMS anakapalli,anakapalli Bulk SMS Solutions,Cheap SMS anakapalli,mass sms service in anakapalli,bulk sms Company anakapalli,bulksms Companies in anakapalli,bulks emails anakapalli,windows hosting anakapalli,linux hosting anakapalli,search engine optimization anakapalli,online websites anakapalli,online marketing services anakapalli,web application software development anakapalli,e-commerce website development anakapalli,graphic designing anakapalli,logo designing anakapalli,add design anakapalli,poster designing anakapalli,event managers in anakapalli,event management in anakapalli,Web design studio anakapalli,creative websites and web hosting services anakapalli,professional web site designing web development anakapalli.

anakapalli design website, website design, web design website anakapalli, website and design, anakapalli website development design, website design development, website design company, company website design,websites design,designer website,design websites,website designer,graphic website design,website graphic design,website designers,graphic design website,website design services,anakapalli designers website,website design hosting, professional website design, website design professional, website design firm,website design software,flash website design,flash design website,website design flash,website design marketing,php website design,design a website,website templates design,website design business,web design websites,designing website,website designing,website designs,business website design,website design and development,website development and design,design your website,website design template,anakapalli website design online,online website design,website design india,ecommerce website design,website hosting and design,website design and hosting,website design companies,website design anakapalli,anakapalli website design,affordable website design anakapalli,website design and marketing,website design service,e commerce website design,website designing india,design of website,website design anakapalli,website design html,website design agency,graphic design websites,internet website design,small business website design,designing a website,designer websites,website design jobs,website design tips,best website design, website design Designing in anakapalli,website design how to,how to design website,website designing company,designers websites,corporate website design,anakapalli website design,websites designing,website design program,designing websites,design your own website,freelance website designer,website design anakapalli,website designing software anakapalli,website designers anakapalli,anakapalli website design,cheap website design anakapalli,website design anakapalli,website design tools,good website design,website layout design,designed websites,easy website design,how to design a website,website design anakapalli,anakapalli website design,website design cost,website design awards,top website design,effective website design,professional website designers,interior design website,anakapalli,anakapalli,andhra Pradesh,India website design,web design,website development,web designers,web development,web design company,web developers,website design company anakapalli,website development,website redesign,website maintenance and content management,anakapalli search engine optimization,reliable website hosting,corporate website design and development,university website design and development,manufacturing industry website design and development,e commerce website design and development,web portal development,web portal developers,web portal design,b2b portal development,b2c portal development,Education,Health Care,Retail,Real Estate website Designing in anakapalli,Manufacturing and Consultant’s & NGOS,payment gateway integration,e-learning,e-commerce,online alumini,e-shop,CMS,anakapalli,andhra Pradesh,India,Bulk SMS anakapalli,Cheap SMS anakapalli,Cheap SMS Provider anakapalli,Cheapest SMS offer,anakapalli Premium SMS Gateway,Bulk SMS Solutions in anakapalli,SMS Short Code,SMS Long Codes,Dedicated Short Code,SMS anakapalli